పెళ్లి పేరుతో యువకులను హానీ ట్రాప్ చేస్తున్న ఆంటీ అరెస్ట్

  • Publish Date - August 18, 2020 / 07:58 AM IST

అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వారిని పరిచయం చేసుకుని…..వారిని హానీ ట్రాప్ ద్వారా ఉచ్చులోకి లాగి డబ్బులు కాజేస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తిని కర్ణాటక, హసన్ పోలీసులు అరెస్ట్ చేశారు.



చిక్ బళ్ళాపూర్ కు చెందిన లక్ష్మీ(32), కోలార్ కు చెందని శివణ్ణలు మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పెళ్లి కాని మగవారిని మోసం చేస్తున్నారు. నిందుతురాలు లక్ష్మి తాను అనాధనని, పిన్ని ఇంట్లో ఉంటున్నానని చెపుతూ తన వివరాలతోమ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పేరు రిజిష్టర్ చేసుకుంది.



ఆమె ప్రోఫైల్ చూసిన హసన్ కు చెందిన పరమేశ్ లక్ష్మిని సంప్రదించాడు. 2019 డిసెంబర్ నుంచి వారి పరిచయం మొదలైంది. ఈ పరియంలో లక్ష్మి వివిధ కారణాలు చెప్పి పరమేశ్ నుంచి రూ.6లక్షల వరకు తీసుకుంది. ఆతర్వాత నుంచి క్రమంగా పరమేశ్ ను దూరం పెట్టసాగింది. అనుమానం వచ్చిన పరమేశ్ ఆమెను నిలదీశాడు.



తనపై అత్యాచారం చేయడానికి యత్నించావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని లక్ష్మి అతడ్ని బెదిరించటం మొదలెట్టింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు లక్ష్మీ, ఆమెకు సహకరిస్తున్న శివణ్ణలను అరెస్ట్ చేశారు.