భార్యను హత్య చేసి…. విషపు పురుగు కుట్టిందన్న భర్త

  • Publish Date - September 3, 2020 / 02:26 PM IST

తాళి కట్టిన భార్యను హత్య చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లాడో ప్రబుధ్దుడు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని నాథూపూర్ గ్రామంలో నివసించే పాశ్వాన్ తన భార్య నిక్కీ కుమారిని(20) 2019 మార్చిలో వివాహాం చేసుకున్నాడు. అప్పటినుంచి వారిద్దరూ నాథూపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు.



ఆదివారం , ఆగస్ట్ 30వ తేదీ ఉదయం తన భార్యను విషపు పురుగు కుట్టిందని… ఊపిరి తీసుకోలేక పోతోందని…చాలా ఇబ్బంది పడుతోందని సమీపంలో నివాసం ఉంటున్న మామ, నిక్కీ కుమారి తండ్రి పర్మానంద్ ఇంటికి పరుగు….. పరుగున వెళ్లి చెప్పాడు.

పర్మానంద్ వెంటనే అల్లుడితో పాటు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే నిక్కీ కుమారి మరణించి ఉంది. చేసేదిమిలేక పర్మానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడే తన కుమార్తెను హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కోన్నాడు.



ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు నిక్కీ కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాశ్వాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళైన నాటి నుంచి తన కుమార్తెను పాశ్వాన్ వేధిస్తున్నాడని …ఇటీవల తరచూ కొడుతున్నాడని…. కుమార్తె చెప్పిందని పర్మానంద్ పోలీసులకు వివరించాడు.
https://10tv.in/dwayne-the-rock-johnson-test-positive-for-covid-19/
ఆదివారం రాత్రికి పోస్టు మార్టం నివేదిక కూడా వచ్చింది. మృతురాలు గొంతు పిసికి ఊపిరాడకుండా చేయటం వల్ల మరణించినట్లు తేలింది. దీంతో పోలీసులు తమ దైన స్టైల్లో పాశ్వాన్ ను విచారించారు. పాశ్వాన్ నిజం ఒప్పుకున్నాడు. ఆగస్ట్ 29 వతేదీ రాత్రి భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. కాగా నిద్రలో ఉన్న భార్యను గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.



తెల్లారాక మామ ఇంటికి పరుగు పురగున వెళ్ళి భార్యను విషపు పురుగు కుట్టిందని కధ అల్లాడు. భార్యపై అతి ప్రేమ ఒలకబోస్తూ ఏడ్చాడు. మామ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసే సరికి నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిపై గురుగావ్ పోలీసు స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసారు.