కోవిడ్ పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చి…మటన్ వండుకుతిన్న దొంగలు

  • Publish Date - July 20, 2020 / 06:49 AM IST

కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు.

జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో నివసించే ఉపాధ్యాయుడు కు కోరనా లక్షణాలు బయట పడ్డాయి. జులై 8 ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అధికారులు ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్ చేసి… అతడిని టాటా మెయిన్ హాస్పటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల అతని సోదరుడు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించాడు. ఇల్లు పరిశీలించి చూడగా…. దొంగలు ఇంట్లో రూ. 50 వేల విలువైన నగదు, ఇతర వస్తువులు దోచుకుపోయినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న బియ్యం, మటన్ వండుకున్నారు. గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తిని మరీ వెళ్లినట్లు అతను గుర్తించాడు.