young man ends life after losing money in IPL betting : వ్యసనాలకు బానిసై ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టటంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నసంఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోనూ కుమార్ యాదవ్(19), హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో నివాసం ఉంటూ తన స్నేహితులతో కలసి స్ధానికంగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గోంటున్న సోనూ కుమార్ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు.
దీంతో ఆర్ధిక ఇబ్బందులు పెరిగిపోయాయి. కాగా మంగళవారం ,నవంబర్ 3వ తేదీ ఉదయం స్నేహితులు బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.