మొబైల్ ఫోన్ చార్జర్ వైరు మెడకు చుట్టి భర్తను హత్య చేసిన మహిళా న్యాయవాది అనిందితా పాల్ కు పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018, నవంబర్ 25న లాయర్ రజత్ డే తనఅపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్ధితిలో మరణించారు. గుండెపోటుతో తన భర్త మరణించినట్లు భార్య అనిందిత పోలీసులకు చెప్పారు.
కలకత్తా హై కోర్టు లాయర్లైన భార్యా,భర్తలు రజత్ కుమార్ డే, అనిందితా డే లు కోల్ కతా లోని న్యూటౌన్, రాజ్ హట్ ప్రాంతంలో డిబి97 అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్ లో నివసిస్తున్నారు.
రజత్ డే మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిందితను విచారించారు. విచారణ సమయంలో ఆమె కేసును తప్పుదోవ పట్టించింది. రజత్ పోస్టుమార్టం రిపోర్టులో మొబైల్ ఫోన్ చార్జర్ వైరు గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడైంది.
https://10tv.in/maharashtra-man-flashes-private-parts-at-woman-on-video-call-booked/
అనిందితా భర్తను హత్య చేసినందుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరీమానా చెల్లించాలని అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సుజిత్ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసినందుకు ప్రయత్నించినందుకు అదనంగా మరో ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.