తమిళనాడుకు చెందిన ప్రేమ జంట పరారైన ఘటనలో చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన ఒక ఆశ్రమ నిర్వాహాకుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజులకండ్రిగలో యోగ్యత అనే పేరుతో ప్రభు అనే వ్యక్తి కొన్నాళ్లుగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఈ ఆశ్రమంలో కొంతమంది అనాధలు ఉంటున్నారు. ఆశ్రమానికి తమిళనాడుకు చెందిన వారు కొందరు వచ్చి వెళ్తుంటారు.
తమిళనాడులోని ఆవడి సమీపంలోని కిల్లికుప్పం గ్రామానికి చెందిన శ్యామ్ శ్రీనివాస్(32) అనే వ్యక్తి కూడా ఆశ్రమానికి తరచూ వస్తూ.. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభుకు పరిచయమయ్యాడు. శ్యామ్‌శ్రీనివాస్ తిరువళ్లూరు జిల్లా తిరుమల్‌వాయిల్‌కు చెందిన వర్ష(20) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. 10 రోజుల క్రితం శ్యామ్, వర్ష పరారై రాజుల కండ్రిగలోని ఆశ్రమానికి వచ్చారు.
కూతురు ఇంట్లో కనిపించకుండా పోవటంతో ఆమె తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఆధారాలతో తిరువళ్లూరు పోలీసులు ఆశ్రమానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్న వర్షను తీసుకుని వెళ్ళి ఆమె తల్లి తండ్రులకు అప్పగించారు.
కాగా రెండురోజుల క్రితం మళ్లీ వర్ష ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లి తండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు సీఐ ఆర్ పురుషోత్తమన్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాజుల కండ్రిగకు వచ్చారు.