నగల దుకాణం చోరీని విఫలం చేసిన పోలీసులు…. ఏడుగురి అరెస్ట్

  • Publish Date - August 13, 2020 / 08:43 AM IST

పూణే పోలీసుల ఒక భారీ దొంగతనాన్ని ఆపగలిగారు. జ్యూయలరీ షాపులో దొంగతనం చేయటానికి సిధ్ధమవుతున్న దొంగలముఠాను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహానం, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పూణే లోని ప్రముఖ నగల దుకాణాన్ని దోచుకోడానికి కొందరు పాత నేరస్ధులు ముఠాగా ఏర్పడి అందుకు కావల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆగస్టు11, మంగళవారం మధ్యాహ్నం హదప్ సర్ లోని, మగర్ పట్ట లో ఒక అపార్ట్ మెంట్ పై దాడి చేసి నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి ఒకకారు, ద్విచక్రవాహనం, కంట్రీ మేడ్ పిస్తోల్, ఒదవిదేశీ రివాల్వర్, 12 బోర్ రైఫిల్స్ , 12 కార్డిర్డ్జ్ లు, కత్తులు వంటి పదునైన మరణాయుధాలు. రూ.14.75 లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వారిలో విశాల్, అలియాష్ శ్యామ్ సత్పట్ (30) , ఆకాష్ రాజేంద్ర సప్కల్(28)పంకజ్ సదాశివ్ గైక్వాడ్(34) రాజు శిరీష్ శివశరణ్((26) గణేష్ మారుతీ కుంజీర్(27) రుషికేష్ రాజేంద్ర పవార్(19) రామేశ్వర్ బాలా సాహెబ్ కజాలే(33) ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 399, 402, ఆయుధాల చట్టం, మరి కొన్ని జాతీయ చట్టాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడు విశాల్ సత్పట్ గతంలోనే నేరం చేసి జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం అతను హత్య కేసులో పెరోల్ పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. శివశరణ్, పంకజ్ గైక్వాడ్, సక్పాల్ లపై కూడా గతంలో హత్య కేసులు కేసు నమోదయ్యాయి. కాని ప్రస్తుతం వారు బెయిల్ పై ఉన్నట్లు పోలీసులువివరించారు.