కోడలు వివాహేతర సంబంధం…. ట్రాక్టర్ తో తొక్కించి…

  • Publish Date - October 31, 2020 / 08:32 AM IST

Widow, Partner Crushed Under Tractor Over Illicit Relationship : మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన వితంతు మహిళ వేరోక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ కోపంతో వారిద్దరినీ ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత పాశవికంగా హత్య చేసారు అత్తింటి వారు.

జల్నా జిల్లాలోని మరియా(32) అనే మహిళకు, ఘన్స్వాంగి తహసీల్ పరిధిలోని చపల్ గావ్ గ్రామానికి చెందిన సంపత్ లాల్జార్ కుమారుడితో పెళ్లైంది. 10 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించటంతో అత్త,మామలతోనే  కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్ భగవత్(27)తో పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాలక్రమంలో వివాహేతర సంబంధానికి దారి తీసింది.



ఈ విషయం తెలుసుకున్న అత్తింటివారు ఇద్దరిని తీవ్రంగా బెదిరంచారు. ఇలాంటి సంబంధాలు మానుకోవాలని….లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భగవత్ తండ్రి తన కొడుక్కి, మరియాకు సంపత్ కుటుంబం నుంచి ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
https://10tv.in/son-brutally-beaten-by-mother-she-involved-in-live-in-relationship-in-guntur-district/
ఇలా ఉండగా మార్చి 30వ తేదీన మరియా, భగవత్ ఇద్దరూ కలిసి గుజరాత్ పారిపోయారు. దీంతో మరియా అత్తమామలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి జాడ కనుక్కొని ఏప్రిల్ 22న, గుజరాత్ నుంచి మహారాష్ట్రకు తీసుకు వచ్చారు.



అప్పటి నుంచి వీరిద్దరూ గ్రామంలోనే సహజీవనం చేయటం మొదలెట్టారు. ఈ ఘటనతో ఇంకా కోపోద్రిక్తులైన మరియా మామ బాత్వెల్ సంపత్ లాల్జారే, అతని కుమారుడు వికాస్ లాల్జారే లు మరియాపై పగ పెంచుకున్నారు. తాము చెప్పిన మాట వినకుండా తమ కుటుంబం పరువు తీసిందని కోపోంతో రగిలిపోయారు. వీరిద్దరిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నారు.



అక్టోబర్ 28న మరియా, భగవత్ లు పక్క గ్రామంలోని ఒక కార్యక్రమానికి వెళ్లి మోటార్ సైకిల్ పై తిరిగి వస్తుండగా…. సంపత్ లాల్జారే, వికాస్ లాల్జారే లు ట్రాక్టర్ తోవారిని ఢీ కొట్టారు. కింద పడినవారిపై ట్రాక్టర్ తో తొక్కించారు. ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్ర గాయాలపాలైన మారియా,భగవత్ లను ఆస్పత్రికి తరలించే లోగానే మరణించారు.

మరియా మామ సంపత్, బావ వికాస్ లాల్జారేలు తన భర్తను, మరియా వికాస్ ను చంపారని ..భగవత్ భార్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వికాస్, అతని తండ్రి సంపత్ లపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై నందేర్కర్ చెప్పారు.