భర్త వివాహేతర సంబంధం..తట్టుకోలేకపోయిన భార్య

  • Publish Date - October 26, 2020 / 11:56 AM IST

husband extra marital affair : తాళి కట్టిన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ ,కుట్లుపూర్ గ్రామానికి చెందిన పాన్ దేవి అనే మహిళ భర్త హరిభరణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.




ఈ విషయం తెలుసుకున్న ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో అక్టోబర్ 23, శుక్రవారం ఇంట్లోంచి వెళ్లి పోయింది. సమీపంలోని రాం గంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం కారణంగా అల్లుడు తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేసేవాడని ఫిర్యాదులో పేర్కోన్నారు. పోలీసులు దేవీ భర్త హరిభరణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.