ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్ కేసులు

  • Publish Date - November 2, 2020 / 07:56 PM IST

married woman missing with children : హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలికాలంలో వివాహిత మహిళలు, యువతులు ఇంటి నుంచి వెళ్ళిపోతున్న కేసులు సంఖ్య  పెరిగిపోతోంది. తాజాగా మియాపూర్ లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదృశ్యం అయ్యారు.

మియాపూర్ హఫీజ్ పేట్, ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న దీపిక (34) తన కుమార్తె సాయిలిపి (14), కుమారుడు చైతన్య(9) తో కలిసి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో ఆరా తీసినా వారి ఆచూకి లభించలేదు.



దీంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్ధానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరోక కేసులో….. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల అదృశ్యం అయ్యారు. చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన మహిళ (32), తన ఇద్దరు చిన్నారులతో 6 రోజుల నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



సికింద్రాబాద్ లోని భావనా కాలనీకి చెందిన మరొక మహిళ (21) కూడా ఆదివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 266 మంది మిస్సింగ్ అయినట్లుగా పోలీసు శాఖ తన వెబ్ సైట్ లో పేర్కోంది.

నానాటికీ తెలంగాణలో పెరిగిపోతున్నమిస్సింగ్ కేసుల సంఖ్య పోలీసులను టెన్షన్ పెడుతోందని చెప్పక తప్పదు. మిస్సైన వారు ఒక్కోక్కరు ఒక్కో కారణంతో మిస్సవుతున్నారు. వివిధ కారణాలతో యువతులు ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.