Viral video: సెల్‌ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడిని బావిలో వేలాడదీసి బెదిరించిన వ్యక్తి

సెల్‌ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో ఓ బాలుడి (8) కుడి చేతిని పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ అందులో పడేస్తానని బెదిరించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను 14 ఏళ్ల ఓ బాలుడు స్మార్ట్ ఫోనులో తీసి, ఆ వీడియోను బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపించాడు. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని అత్కోహా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral video: సెల్‌ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో ఓ బాలుడి (8) కుడి చేతిని పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ అందులో పడేస్తానని బెదిరించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను 14 ఏళ్ల ఓ బాలుడు స్మార్ట్ ఫోనులో తీసి, ఆ వీడియోను బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపించాడు. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని అత్కోహా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. అతడికి ఎనిమిదేళ్ల బాలుడిపై అనుమానం వచ్చి ఆ బాలుడిని పట్టుకున్నాడు. దగ్గరలోకి బావి వద్దకు తీసుకువెళ్లి ఆ బాలుడిని ఒక చేత్తో పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ తన సెల్‌ఫోన్ ఎక్కడ పెట్టాడో చెప్పాలంటూ బెదిరించాడు. నిజం చెప్పకపోతే చేతిని వదిలేసి బావిలో పడేస్తానని హెచ్చరించాడు.

అదే సమయంలో అక్కడ ఉన్న 14 ఏళ్ల బాలుడు ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోనులో తీశాడు. అనంతరం దాన్ని బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపి, సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేశాడు. చివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.