కీచకులు….యువతిని వివస్త్రను చేసిన కామాంధులు

  • Publish Date - August 14, 2020 / 09:53 AM IST

ఆడవాళ్లు కనిపిస్తే చాలు వారిని నఖశిఖ పర్యంతం స్కాన్ చేసి వక్ర దృష్టితో వారిని చూసే సమాజం ఎక్కువైపోతోంది. మగాళ్లు మృగాళ్లు లా మారుతున్నారు. కొందరు యువకులు ఓ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసి బట్టలు ఇవ్వకుండ ఆమెను ఏడ్పించి వికృత చేష్టలకు పాల్పడ్డారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.

నెల్లూరు లోని వెంకటేశ్వరపురం జనార్ధన రెడ్డి కాలనీలోని మహమూర్ మసీదు వెనుక గొర్రెల మండి ఉంది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపు వెళుతూ…… నిలిపి ఉన్న ఆటోను గమనించాడు.

రాత్రి సమయంలో అక్కడ ఎందుకు ఆపి ఉందో అనుకుంటూ అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు ఒక యువతిని వివస్త్రను చేసి, దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే గొర్రెల కాపరి వారిపై తన వద్ద ఉన్న టార్చి లైట్ వేశాడు. దీంతో వారు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు.

గొర్రెలకాపరి తన వద్ద ఉన్న దుస్తులు యువతికి ఇవ్వటంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా ఈ విషయమై ఇంతవరకు ఎవ్వరూ ఫిర్యాదు ఇవ్వలేదని, ఘటనపైవిచారణ జరిపస్తామని నవాబు పేట సీఐ వేమారెడ్డి తెలిపారు.