Ranchi man sacrifices daughter in aspiration to have baby boy : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటి, టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్నాప్రజలు ఇంకా మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు. జార్ఖండ్ లోని అనేక మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా బాబాలు, మంత్రగాళ్లను నమ్ముతూనే ఉన్నారు. కొడుకు పుట్టాలంటే కన్నకూతురుని బలి ఇవ్వాలని ఓ మంత్రగాడు చెప్పటంతో, తండ్రి కూతురు గొంతు కోసి హత్య చేసిన ఘటన జార్ఖండ్ లోని రాంచీలో జరిగింది.
రాంచీ, లోహర్ దగాలోని పెష్రార్ లో నివసించే సుమన్ నగాసియా(26) దినసరి కూలీగా పని చేస్తూ ఉంటాడు. అతనికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కుమారుడు కావాలనే కోరికతో నగాసియా సుజాన్ ఓజా అనే మాంత్రికుడిని సంప్రదించాడు.
కూతురును బలి ఇస్తే కొడుకు పుడతాడని ఆ మంత్రగాడు నగాసియాకు చెప్పాడు. విచక్షణ కోల్పోయిన నగాసియా తన కుమార్తెను చంపేందుకు వెనుకాడలేదు. ఇంటికి వచ్చాడు. ఇంట్లో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో కూతురు ఆడుకుంటోంది.
మాంత్రికుడు చెప్పినట్లు … కూతురును అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నగాసియాను అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడు సుజాన్ ఓజా కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.