మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య

  • Publish Date - September 9, 2020 / 07:02 AM IST

తెలుగు టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని చనిపోయారు. మనసు మమత. మౌనరాగం వంటి సీరియల్స్ లో శ్రావణి నటించారు.




లాక్ డౌన్ తర్వాత తిరిగి సీరీయల్స్ నిర్మాణం జరుగతుండటంతో ప్రస్తుతం ఆమె మరికొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆమె గత 8 సంవత్సరాలుగా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే కారణమని భావిస్తున్నారు. టిక్ టాక్ లో పరిచయమైన వ్యక్తి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్నహత్య చేసుకున్నట్లు ప్రాధమిక సమాచారం.
https://10tv.in/mandapeta-police-arrest-2-men-for-murder-plot/
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలు కు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ అనే వ్యక్తి టిక్ టాక్ ద్వారా శ్రావణికి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం క్రమేపి కొన్నాళ్లకు ప్రేమగా మారింది. తనకి తల్లి తండ్రులెవరూ లేరని సన్నీ ఆమెకు మరింత దగ్గరయ్యాడు.




సన్నీ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లి తండ్రులు ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.