ఇద్దరు మైనర్ బాలికలపై 11 మంది గ్యాంగ్ రేప్

  • Publish Date - August 1, 2020 / 02:42 PM IST

దేశంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఎక్కడో ఒక చోట తమ నైజాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మహిళలపై దాడులు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నా వాటిని చూసి ఏమాత్రం జంకు బొంకు లేకుండా మహిళలు, చిన్నారి బాలికలపై దాడులు చేస్తూనే ఉన్నారు.



ఇటీవల త్రిపురలో ఓ యువతిపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ ఆలస్యంగా వెలుగు చూసింది.

బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్లైన ఇద్దరు అక్కాచెల్లెళ్ళపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. అంతేగాక ఈ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బాధితులను బెదిరింపులకు గురి చేశారు. ఇదిలా ఉండగా ఈ అమానుష ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం మరింత దారుణం.



బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు అక్క చెల్లెళ్లపై 8 మంది యువకులు , 3మైనర్లు సామూహిక అత్యాచారానికి ఒడి గట్టారు. మే 31 వతేదీన జరిగిన ఈ అకృత్యాన్ని నిందితులు వీడియో తీసారు. ఆ వీడియో బాలికలకు చూపిస్తూ ఈ నేరం గురించి ఎవరికి చెప్పవద్దని బెదిరించారు.

దాదాపు 2 నెలల తర్వాత బాలికలు ధైర్యం చేసి జులై 29 న పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం వెలుగు చూసింది. అత్యాచారం చేసిన వీడియో తన వద్ద ఉందని బాధితుల్లో ఒక బాలికకు తెలియని నెంబరు నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

తమను కూడా కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తామని వారు బెదిరిస్తుండటంతో బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరు బాలిక బంధువు ఉండటంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిచ్చిన సమాచారంతో నిందితుల్లో మిగిలిన 10 మందిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.