‘‘ప్రేమించానన్నాడు..నువ్వు కాదంటే చచ్చిపోతానన్నాడు..నువ్వే నా ప్రాణం..నువ్వు లేనిదే నాకు జీవితమే లేదన్నాడు..కలకాలం నీకు తోడూనీడగా నీ కంట తడికాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను.. ఒక్కసారి నిన్ను ప్రేమించానని చెప్పు వెయ్యి జన్మలకూ నిన్ను విడిచిపెట్టనని’’ అంటూ వెంటపడిన యువకుడి ప్రేమకు కరిగిపోయిందా యువతి. నీకోసం మా అమ్మానాన్నలకు వదిలేసి వస్తాను..నా కోసం నువ్వు వస్తావా? అని కళ్లనిండా ప్రేమ నింపుకుని అడిగినవాడే నమ్మి వచ్చిన ప్రేమను కడతేర్చిన కసాయిగా మారాడు.కులం..మతం ఏమీ మనకొద్దు ఒకరికొకరం బతుకుతామని బాసలు చేసినవాడే నా కోసం మతం మారావా. ఇదేనా నీ ప్రేమ అంటూ ఉన్మాదిగా మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే కట్టుకున్న భార్యను కడతేర్చాడు..
ప్రేమించేటప్పుడు గుర్తుకు రాని మతం పెళ్లి అయ్యాక గుర్తుకొచ్చింది. ప్రేమించినప్పుడు అడ్డుపడని మతం పెళ్లయ్యాక పెద్ద నేరంగా కనిపించిందా నీచుడికి. భార్యని తన మతంలోకి మారమని పట్టుబట్టాడు వేధించాడు. మతం వేరైనంత మాత్రాన మన ప్రేమలో మార్పు ఉంటుందా? మతం మారను..నీ మీద నా ప్రేమ తగ్గదని చెప్పిన భార్యను పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల నరికి దారుణంగా హత్యచేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి జిల్లాలోని ప్రీత్ నగర్‌కు చెందిన ప్రియా సోని అనే యువతిని..ఇజాజ్ అహ్మద్ అనే యువకుడు ప్రేమలో పడింది. ఇద్దరి మతాలు వేరు కావటంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అవగానే భర్త ఇజాజ్ ప్రియాను మతం మార్చుకోవాలని ముస్లిం మతంలోకి మారాలను తరచు అన్నటం ప్రారంభించాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. ప్రేమకు మతానికి లింక్ పెడతావేంటీ. ఇప్పుడు మనం బాగానే ఉంటున్నాం కదాని అనేది. దానికి అమ్మద్ ఊరుకోకపోగా మతం మారాలనే పదే పదే వేధించేవాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు సరికదా..మతం మారే ప్రసక్తే లేదని..ఇంకెప్పుడు నాకు ఇటువంటి మాటలు చెప్పొద్దని ఖరాఖండిగా చెప్పేసింది.
దీంతో ఇజాజ్ అహ్మద్ భార్య ప్రియపై ఆగ్రహంతో రగిలిపోయాడు. నువ్వు లేనిదే బతకలేనని అన్న ప్రేమ ఏమైపోయిందో ఏమో…మతోన్మాదంతో రగిలిపోయాడు..భార్యకు మాయ మాటలు చెప్పి..సెప్టెంబర్ 21న ప్రీత్ నగర్ ఏరియాలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తన స్నేహితుడి సహాయంతో గొంతుకోశాడు..తరువాత అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశాడు. తరువాత ఆ అడవుల్లో ప్రియ మృతదేహాన్ని ఒకచోట..తల ఒకచోట పడేసి పరారైయ్యాయడు. ప్రియ తండ్రికి ఈ విషయం తెలియటంతో ఘటనా ప్రాంతానికి వెళ్లి చూడగా..కూతురు మృతదేహాన్ని గుర్తు పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఇజాజ్ అహ్మద్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బగ్గా నాలా పూల్ వద్ద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన ఇజాజ్ స్నేహితుడు షోయాబ్ ను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఇజాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ దారుణ ఘటనపై ఎస్పీ ఆశిష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..ప్రియను హత్య చేసిన ఆమె భర్త ఇజాజ్ అమ్మద్ ను అతని స్నేహతుడు షోయాబ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను..వారి మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని..కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.