ఉత్తర ప్రదేశ్, హాపూర్ లోని గాధ్ముక్తేశ్వర్‌లో 6 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అనుమానిత నిందితుడి ఊహా చిత్రాలను విడుదల చేశారు. గురువారం రాత్రి బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా నిందితుడు ఎత్తుకెళ్ళాడు.
శుక్రవారం ఉదయం చెరువు సమీపంలోని పొలాల్లో ఒంటిపై తీవ్రమైనగాయలతో రక్త స్రావమై బాలిక పడిఉండగా కనుగొన్నారు. ఆమె పై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. బాలికను మొదట స్ధానికంగా ఉన్న జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మీరట్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు.
ఆమె పై అత్యాచారం జరిగిందని, సున్నితమైన శరీర భాగాలను గాయం చేసినట్లు వైద్యులు ధృవీకరించారు. గుర్తు తెలియని నిందితుడిపై అత్యాచారం, పోస్కో, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఆధారాలతో అనుమానితుడి 3 ఊహా చిత్రాలను హాపూర్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడిని పట్టుకోటానికి 8 బృందాలు గాలింపు చేపట్టాయని హాపూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు.
బాలిక తప్పిపోయిందని గ్రామస్తులు ఫిర్యాదు చేయటానికి పోలీసుస్టేషన్ కు వెళితే వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో పోలీసులు సత్వరమే స్పందించలేదని గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహంతో ఉన్నారు. రాత్రంతా బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలిక కోసం గాలించారు. మరునాడు ఉదయం బాలికను అపస్మారక స్ధితిలో కనుగొన్నారు.
కాగా నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. అనుమానిుతుడిని పట్టుకునేందుకు వెళ్లగా అప్పటికే అనుమానితుడు అక్కడ్నించి తప్పించుకుని పారిపోయాడు.బాలికకు మీరట్ మెడికల్ కాలేజ్ హాస్పటల్ లో శస్త్రచికిత్స లు కూడా జరిగాయి. బాలిక ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది.