తల్లీ, కూతురుకు అండగా ఉంటానని నమ్మించి లైంగిక దోపిడి

  • Publish Date - July 25, 2020 / 07:16 AM IST

భర్తనుంచి విడిపోయిన కూతురిని పెట్టుకుని, మగదిక్కులేక ఒంటరిగా జీవిస్తున్న మహిళ కుటుంబానికి తోడుగా ఉంటానని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. మాయమాటలతో వారిని లోబరుచుకుని వారిపై లైంగికంగా దాడి చేయటమే కాక, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన మోసగాడి ఉదంతం విశాఖ జిల్లాలో బయట పడింది.

విశాఖ జిల్లా పెందుర్తి అప్పన్న పాలెం ప్రాంతానికి చెందిన మహిళ (50) తన కుమార్తె(35) తో కలిసి 8నెలల క్రితం వరకు మురళీ నగర్ ప్రాంతంలో ఉండేవారు. కూతురు గతంలో భర్తతో గొడవ పడి తన పదహారేళ్ల బాలికతో పుట్టింటికి వచ్చి తల్లి తండ్రుల దగ్గర ఉంటోంది. తండ్రి మరణించిన తర్వాత తల్లి చేసే దుస్తులు, ఫైనాన్స్ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. వీరి వ్యాపారం బాగానే సాగుతోంది.

తల్లి కూతుళ్లు ఒంటరిగా ఉంటున్నారని, వీళ్ళ ఆర్దిక పరిస్ధితిని గమనించిన స్దానికంగా ఉండే యర్రంశెట్టి చిన్ని(35) అనే వ్యక్తి వారి పై కన్నేశాడు. క్రమంగా వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి తల్లిని వశపరుచుకున్నాడు. తనకంటే వయస్సలో పెద్దదైన ఆంటీని లైంగికంగా లొంగదీసుకున్నాడు. తన అవసరాలకు ఆమె వద్ద డబ్బులు తీసుకోవటం మొదలెట్టాడు. చిన్నితో లైంగికంగా తృప్తి పొందుతున్న తల్లి కూతురుకి తెలియకుండా అతనికి డబ్బు సర్దుబాటు చేసేది.

కొన్నాళ్ళకు కూతురుని లోబరుచుకుని ఇద్దరితో శృంగారం చేస్తూ ఎంజాయ్ చేయసాగాడు. ఇంతలో మీకు సొంతగా ఒక ఫ్లాట్ కొంటానని చెప్పి వారి వద్ద నుంచి విడతల వారీగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఎన్నాళ్ళైనా ఫ్లాట్ విషయం చెప్పక పోవటంతో…ఫ్లాట్ కొనలేదని అనుమానం వచ్చిన తల్లీ, కూతుళ్లు నిలదీశారు. దీంతో వారిని బెదిరించటం మొదలెట్టాడు.

మీరు నాతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భయపెట్టాడు. బాలికకు మీకు పట్టిన గతే పట్టిస్తానని బెదిరించాడు. దీంతో తమబాధ ఎవరికీ చెప్పుకోలేక తల్లీ కూతుళ్ళు వారిలో వారే చాలా కాలం మౌనంగా రోదించారు. రాను రాను అతడి బెదిరింపులు ఎక్కువవ్వటంతో కూమార్తె కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చిన్ని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.