ఉత్తరప్రదేశ్ లో అమానుష ఘటన జరిగింది. ఓ వితంతువు, దివ్యాంగుడైన పురుషుడు స్నేహంగా ఉంటున్నారని వారిపై అత్యంత హేయంగా దాడి చేశారు. వితంతు మహిళకు శిరో ముండనం చేసి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యామాల్లో వైరల్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని కనౌజ్ జిల్లాకు చెందిన బాధితురాలి (37) భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో దివ్యాంగుడైన(40) ఒక వ్యక్తి ఆమెకు అవసరమైన విషయాల్లో సహయం చేస్తూ స్నేహంగా ఉంటున్నాడు.
https://10tv.in/arizona-man-earns-3-lakh-rupees-per-month-by-letting-people-with-a-foot-fetish/
అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధం బాధితురాలి బంధువులకు ఎంత మాత్రం నచ్చలేదు. భర్త చనిపోయిన తర్వాత పరాయిమగాడితో చనువుగా ఉంటూ తమ పరువు తీస్తోందని వారు భావించారు. దీంతో ఎలాగైనా వాళ్లిద్దరకీ బుధ్ది చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా నెమ్మదిగా అక్కడకు చేరుకున్నారు. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ బాధితులకు గుండు కొట్టించారు.
తర్వాత ముఖానికి నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి వీధుల గుండా ఊరేగించారు. ఈ తంతగాన్నంతా కొందరు సెల్ ఫోన్ లో వీడియోతీయటంతో ఈ అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.