Woman commits suicide with her two daughters : కుటుంబంలో ఇంటి యజమాని మరణం ఆకుటుంబం మొత్తాని బలి తీసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఇల్లాలు మనోవేదనతో కన్నకూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది.
తిరుచ్చిలోని సత్యమూర్తి నగర్ కు చెందిన అరుణ్‌పాండియన్ (44) కాంట్రాక్టర్. ఆయనకు భార్య వలర్మతి(38), కుమార్తెలు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. ఈ ఏడాది ప్రాంరంభంలో అరుణ్‌పాండియన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆవ్యాధికి చికిత్స తీసుకునేందుకు మధురైలోని, మలై స్వామిపురంలో నివాసం ఉంటున్న మరదలు సరస్వతి ఇంట్లో మేడపై భాగంలో ఉంటున్నారు ఆ కుటుంబం.
చికిత్స పొందుతున్నప్పటికీ రోగం ముదిరి జులైలో అరుణ్ పాండియన్ కన్ను మూశాడు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాము పెంచుకుంటున్న కుక్కను కూడా గొంతు నులిమి చంపి వారు ఈ లోకం నుంచి దూరం అయ్యారు.
తెల్లవారాక ఎంత సేపటికి వలర్మతి పిల్లలు బయటకు రాకపోవటంతో, సరస్వతి భర్త పైకి వెళ్లి చూడగా ఉరివేసకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి మృతదేహాలను మదురై ప్రభత్వాసుపత్రికి తరలించారు.
ఫ్యామిలీ ఫోటో వద్ద ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఆస్తులను తన తల్లి లక్ష్మికి అప్పగించాలని వలర్మతి అందులో పేర్కొంది. తమ అంత్యక్రియులను తల్లి లక్ష్మి చేతుల మీదుగా జరిపించాలని…..తమతో పాటుగా శునకాన్ని ఖననం చేయాలని కోరారు.
అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి లేకపోవడం కష్టతరంగా ఉందని, అందుకే నాన్న వద్దకే వెళుతున్నామని ఇద్దరు కుమార్తెలు లేఖలో పేర్కొనడం అందరి హృదయాలను బరువెక్కించింది.