తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తోడల్లుడి హత్య

  • Publish Date - July 23, 2020 / 09:30 AM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్రేమ్ కుమార్ విఘ్నేశ్వరన్ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇళ్లల్లో తెలియకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ఇద్దరూ రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. కొన్నాళ్లకు ఈ విషయం విఘ్నేశ్వరన్ కు తెలిసింది. ఎలాగైనా తోడ్లలుడిని హాతమార్చాలనుకున్నాడు.

ఈ క్రమంలో జులై 21 మంగళవారం రాత్రి ప్రేమ్ కుమార్, విఘ్నేశ్వరన్ భార్య కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆమెను రాత్రికి తన ఇంటికి రమ్మని ప్రేమ్ కుమార్ చెప్పాడు. ఈ విషయం విఘ్నేశ్వరన్ కు తెలిసింది. కోపం కట్టలు తెంచుకుంది. తన తమ్ముడు మరో ఇద్దరు స్నేహితులకు ప్రేమ్ కుమార్ తన భార్యతో సాగిస్తున్న వివాహేతర సంబంధం విషయం చెప్పాడు.

మంగళవారం రాత్రి ప్రేమ కుమార్ ఎక్కడ ఉన్నాడో వాకబు చేశాడు. కేటీసీ నగర్ వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడకు స్నేహితులతో వెళ్లాడు. అక్కడ ప్రేమ్ కుమార్ ను, విఘ్నేశ్వరన్ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. తాను ఒక్కడు ఉన్నాడు. వాళ్లు నలుగురు ఉన్నారు. పరిస్ధితి అర్ధం చేసుకున్న ప్రేమ్ కుమార్ అక్కడినుంచి పారిపోవాలని ప్రయత్నించి పరిగెట్టాడు.

విఘ్నేశ్వరన్ తోపాటు ఉన్నవాళ్ళు ప్రేమ్ ను వెంబడించారు. పరిగెత్తుతున్న ప్రేమ్ ఒక్కసారి కిందపడ్డాడు. వెంటనే విఘ్నేశ్వరన్ తన వద్ద ఉన్నకత్తితో అతడ్ని పొడిచి చంపాడు. వారి దాడిలో తీవ్ర రక్తస్రావం అయిన ప్రేమ్ కుమార్ ఘటనా స్ధలంలోనే కన్నుమూశాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని తూతుక్కుడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రేమ్ కుమార్ తలపై 10 గాయాలున్నాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టుటికోరన్ ఎస్పీ ఎస్ జయకుమార్ చెప్పారు.