11-year-old boy steals Rs 20 lakh from PNB bank : పట్టపగలు ఆ బ్యాంకులో రద్దీగా ఉంది.. అదే సమయంలో బ్యాంకులోకి ఓ 11ఏళ్ల కుర్రాడు వచ్చాడు.. క్యాష్ కౌంటర్‌పై కన్నేశాడు. అదను చూసి రూ.20 లక్షలతో తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన హరియాణా జిల్లాలోని జింద్ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో జరిగింది.
బ్యాంకులోకి చొరబడిన ఆ కుర్రాడు వెళ్లేటప్పుడు 4 బండెళ్ల క్యాష్ (bundles of cash) ను బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయినట్టు అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. బాలుడు రూ.20 లక్షల క్యాష్ కొట్టేసినా బ్యాంకు సిబ్బంది ఎవరూ కనిపెట్టలేకపోయారు. క్యాష్ కౌంటర్‌లో ఉండాల్సిన క్యాషియర్ వాష్ రూంకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు నేరుగా వెళ్లి నాలుగు క్యాష్ బండెళ్లను దొంగతనం చేశాడు.
ఒక్కో బండెల్ లో రూ. 5లక్షల చొప్పున ఉన్నాయి. ఎప్పటిలానే బ్యాంకు పనివేళలు ముగిసాక ఆ రోజు వచ్చిన నగదును లెక్కించారు బ్యాంకు సిబ్బంది.. ఆన్ లైన్ డేటాకు క్యాష్ కు సరిపోలలేదు. రూ.20 లక్షలు తక్కువగా ఉండటంతో షాక్ అయ్యారు. నిర్లక్ష్యంగా కౌంటర్ కు లాక్ వేయకుండా బాత్ రూంకు వెళ్లిన క్యాషియర్ పై బ్యాంకు యాజమాన్యం మండిపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. బ్యాంకులోని సీసీ ఫుటేజీని పరిశీలించారు.
అందులో క్యాష్ కౌంటర్లోకి ఓ కుర్రాడు వెళ్లి క్యాష్ బ్యాగులో వేసుకోవడం రికార్డు అయింది. దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో మనోవర్, రవీందర్ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.