నిద్ర లేకుండా చేస్తోందని 13 రోజుల పాపాయిని నీటి డ్రమ్ములో ముంచేసి చంపేశాడో కసాయి. కేవలం నిద్ర కోసం 13రోజులకే నూరేళ్లూ నిండేలా చేశాడా దుర్మార్గుడు. పసిబిడ్డకు మేనమామ ఈ ఘాతుకాలనికి పాల్పడిన ఘటన మహారాష్ర్ట లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామంలో జరిగింది.
లాతూర్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల క్రితం పురిటి నొప్పులు రావటంతో స్థానికంగా ఉండే హాస్పిటల్ కు తీసుకెళ్లగా…పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. తరువాత హాస్పిటల్ నుంచి డిశార్జ్ అయి రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు.
అయితే పసిబిడ్డ రాత్రి సమయంలో ఒకటే ఏడుస్తోంది. చాలామంది బిడ్డలు ఇలాగే ఏడుస్తుంటారు అలాగే ఈ బిడ్డ కూడా తరచూ ఏడుస్తుండేంది. దీంతో పిల్ల 19 ఏళ్లున్న మేనమామ కృష్టషిండే..‘‘అబ్బా ఏంటీ..రోజు ఒకటే ఏడుపులు..నిద్రపట్టటం లేదంటూ విసుక్కునేవాడు. కానీ ఎంత సముదాయించినా బిడ్డ ఏడుస్తూ ఉండేది..దీంతో కృష్ణకు చిరాకు పెరిగిపోయింది. ఇరిటేట్ అయిపోయాడు..
రోజు ఇలాగే ఏడుస్తుందీ శనిగొట్టుది అని ఒకటే చిరాకుపడిపోతూ..సోమవారం (ఆగస్టు 31,2020) ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో పడేసి ఏమీ తెలియనట్లు బైటికెళ్లిపోయాడు.దీంతో మంచంమీద పడుకోబెట్టిన పసిబిడ్డ కనిపించకపోయేసరికి తల్లి కంగారుపడిపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఇదేంటీ ఆడుకునే బిడ్డ అయితే ఎక్కడికన్నా వెళ్లిపోయిందనుకోవచ్చు..13 ఏళ్ల పసిబిడ్డ ఆకలేస్తే ఏడవటం తప్ప ఏమీ తెలీదు..ఎలా మాయం అయిపోయిదంటూ వెతుకుతుండగా…అలా చుట్టుపక్కలవారికి తెలిసింది. వారు కూడా ఆశ్చర్యపోతూ వెతకటం ప్రారంభించిగా ఓ వ్యక్తి అనుకోకుండా నీటి డ్రమ్ము తీసి చూడగా దాంట్లో బిడ్డ శవం తేలుతూ కనిపించింది. దీంతో కెవ్వును కేక వేసేసరికి పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి ఆ దృశ్యం భోరున ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది.
దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా..ఘటనాస్థలానికి వచ్చి చూశారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారని ప్రశ్నించారు. కానీ..ఇంత జరిగినా.. పిల్ల మేనమామ కృష్ణ కనిపించకుండాపోయేసరికి పోలీసులు అతనిపై అనుమానం వ్యక్తంచేసి గాలించి.. కృష్ణ షిండేను అదుపులోకి తీసుకుని విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని..అందుకే నీటిలో ముంచి చంపేశానని ఒప్పుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.