ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి 

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.

  • Publish Date - February 13, 2020 / 01:43 AM IST

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 31 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కొసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 

నాగ్లాఖాంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ప్రైవేట్‌ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఆగ్రా-లక్నో హైవేపై రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్‌ బస్సు ఢిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.