Girl Students Drugged Molested : స్కూల్‌లో ఘోరం… 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో 17మంది అమ్మాయిలను స్కూల్ కి పిలిపించారు. వారందరిని రాత్రి అక్కడే ఉంచారు. వారికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అంతా మత్తులోకి జారుకున్న తర్వాత..

Girl Students Drugged Molested : గురువంటే దైవంతో సమానం అంటారు. పాఠశాలను దేవాలయం అంత పవిత్రమైనదిగా చూస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే. గురువులపై ఎంతో గురుతర బాధ్యత ఉంటుంది. అందుకే గురువుని దైవంలా చూస్తారు. ఉపాధ్యాయ వృతికి ఎంతో గౌరవం ఇస్తారు. అయితే కొందరు టీచర్లు పవిత్రమైన ఉపాధ్యాయ వృతికి కళంకం తెస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన టీచర్లు లైంగిక దాడులకు తెగబడుతున్నారు.

ఇద్దరు స్కూల్ మేనేజర్లు దారుణానికి ఒడిగట్టారు. 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లో ఈ దారుణం వెలుగు చూసింది. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 17మంది అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. పుర్కాజీ ప్రాంతంలోని జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నవంబర్ 18న ఈ దారుణం జరిగింది.

Omicron Tension : శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో 17మంది అమ్మాయిలను స్కూల్ కి పిలిపించారు. వారందరిని రాత్రి అక్కడే ఉంచారు. వారికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అంతా మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్లపై ఇద్దరు మేనేజర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.

నవంబర్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో బయటకు చెబితే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తామని, కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని స్కూల్ మేనేజర్లు బెదిరించారు. దీంతో బాలికలు మౌనంగా ఉండిపోయారు. అయితే, ఓ బాధిత విద్యార్థిని ధైర్యం చేసింది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటికీ ఆ కీచకులను అరెస్ట్ చేయలేదు. కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు కేసు తీవ్రతను తగ్గించేందుకు, ఆ కీచక మేనేజర్లను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ ను పోలీసులు వేధిస్తున్నారని, అతడిపై బ్లాక్ మెయిల్ కేసు పెట్టారని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పారు. స్థానిక బీజేపీ నేత రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఘటన జరిగిన రెండు వారాల తర్వాత వెలుగులోకి వచ్చింది. 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు