Bengaluru Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు.. కీలక సూత్రధారుల అరెస్ట్

Bengaluru Cafe Bomb Blast : బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహాలు కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో పట్టుబడ్డారు.

Bengaluru Cafe : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరిని ఎన్ఏఐ అరెస్ట్ చేసింది. ఈ బాంబు పేలుడు ఘటనలో సూత్రధారి అయిన అబ్దుల్ మతీన్ తహా, ముసావీర్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కాంతి వద్ద వీరిద్దరిన అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం (ఏప్రిల్ 12) తెలిపింది.

Read Also : Insurance Fraud : సినిమా స్టోరీని మరిపించాడుగా.. ఇన్సూరెన్స్ కోసం బతికే ఉన్నా చనిపోయినట్లు క్రియేట్ చేసి..!

బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహాలు కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో పట్టుబడ్డారని ఎన్ఐఏ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

18 ప్రాంతాల్లో అధికారుల సోదాలు..  తహా, ముసావీర్ అరెస్ట్ :
ఈ బాంబు పేలుడు ఘటన కేసులో మతీన్ తాహా ప్రమేయం ఉందని గుర్తించింది. అంతేకాదు.. 2020 ఉగ్రవాదం కేసులో కూడా వీరికి ప్రమేయం ఉందని తెలిపింది. ఈ కేసులో కీలక సూత్రధారులైన వీరిద్దరిని అరెస్టు చేయగా.. గత నెలలో షాజేబ్, తాహాలకు సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని 18 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో షాజేబ్, తాహా నివాసితులుగా గుర్తించారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో 10 మంది, కస్టమర్‌లు, సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. పేలుడు పదార్థాలను కలిగిన సంచిని తక్కువ రద్దీగా ఉండే ప్రదేశంలో ఉంచడం ద్వారా ప్రాణనష్టం జరగలేదు.

పేలుడు అనంతరం బెంగళూరులోని సీసీటీవీ కెమెరాల్లో నిందితుల ఫొటోలు, వీడియోలను ఎన్‌ఐఏ విడుదల చేసింది. పేలుడు జరిగిన గంట తర్వాత నిందితులిద్దరూ ముఖానికి మాస్క్ ధరించి బస్సు ఎక్కుతున్నట్లు కనిపించారు. నిందితులను పట్టించి సమాచారం ఇచ్చినవారికి ఎన్ఐఏ రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. పేలుడు తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన రామేశ్వరం కేఫ్ మెటల్ డిటెక్టర్లతో సహా మెరుగైన భద్రతా చర్యలతో 8 రోజుల తర్వాత తిరిగి ఓపెన్ అయింది.

Read Also : Viral Video : పార్సిల్ ఇచ్చి క‌స్ట‌మ‌ర్ షూ కొట్టేసిన స్విగ్గీ డెలివ‌రీ బాయ్‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు