వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం జరిగింది. వృద్ద దంపతులు బుధవారం (అక్టోబర్ 30, 2019) సాయంత్రం సజీవదహనం అయ్యారు. అమ్మానానలకు అండగా ఉండి, వారిని ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం వారినే సజీవ దహనం చేశాడు. ఈ ఘటన మడిపల్లి శివారు గేట్ తండాలో చోటుచేసుకుంది.
వివరాలు.. తండాకు చెందిన భూక్యా దస్రు(68), బాజు(65) దంపతులు తమ ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. వెంటనే అక్కడి స్థానికులు ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేలోపే ఇద్దరూ చనిపోయారు. దీంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ కు సమాచారం అందించగా.. నవీన్ అనంతరం ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు.
వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆ దంపతులు కష్టపడి సంపాదించుకున్న పదెకరాల వ్యవసాయ భూమిలో రెండెకరాలను వారు బ్రతకడం కోసం ఉంచుకుని.. మిగిలిన ఎనిమిది ఎకరాలను కుమారులకు పంచి ఇచ్చారు. అయితే వారికి పంచిన ఆస్తిలో తేడాలు వచ్చి నిద్రిస్తున్న తల్లిదండ్రులను కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు.