Kukatpally Women Killed: కూకట్‌పల్లిలో దారుణం.. ప్రెషర్ కుక్కర్ తో కొట్టి, గొంతు కోసి.. మహిళ దారుణ హత్య.. పని మనుషుల పనే?

ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు, నగలు ఎత్తుకుపోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Kukatpally Women Killed: కూకట్‌పల్లిలో దారుణం.. ప్రెషర్ కుక్కర్ తో కొట్టి, గొంతు కోసి.. మహిళ దారుణ హత్య.. పని మనుషుల పనే?

Updated On : September 11, 2025 / 12:47 AM IST

Kukatpally Women Killed: హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లో మహిళ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ రక్తపు మడుగులో కనిపించారు. ఆ ఇంటి పని మనుషులే ఇల్లు దోచుకుని రేణుని చంపి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. స్పాట్ కి చేరుకున్నారు క్లూస్ టీమ్, కూకట్ పల్లి పోలీసులు.

రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితమే హర్ష్ పనిలోకి చేరాడు. గత ఎనిమిదేళ్లుగా పక్కింట్లో పని చేస్తున్న రోషన్ తో కలిసి రేణు కాళ్లు చేతులు కట్టేసి హతమార్చినట్లు సమాచారం. ముందు ప్రెషర్ కుక్కర్ తో తల మీద మోది.. ఆ తర్వాత కత్తితో గొంతుకోసి రేణుని అత్యంత పాశవికంగా చంపేశారు. ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు, నగలు ఎత్తుకుపోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

”బుధవారం రాత్రి 7.30 గంటలకు మాకు సమాచారం అందింది. దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న మహిళ హత్యకు గురైందని సమాచారం ఇచ్చారు. మేము వెంటనే స్పాట్ కి వచ్చాం. సిజర్, రెండు మూడు చాకులు వాడారు. గొంతు కోసి చంపారు. మహిళ ఇంట్లో పని చేసే వ్యక్తులపై అనుమానాలు ఉన్నాయి. జార్ఖండ్ కు చెందిన వ్యక్తి ఈ హత్య చేసినట్లుగా అనుమానం ఉంది. అతడు మరో సర్వెంట్ తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లడం, టూ వీలర్ పై వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వారి కోసం మేము గాలిస్తున్నాము.

మహిళ తన భర్త, బాబుతో ఇంట్లో ఉంటారు. భర్త పొద్దున్నే షాష్ కి వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేస్తే తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. రాత్రి 7 గంటల సమయంలో వచ్చి చూడగా డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా బయటకు రాలేదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో ప్లంబర్ సాయంతో లోపలికి వెళ్లారు. బాల్కనీ నుంచి వచ్చి చూడగా మహిళ శవం కనిపించింది. వెంటనే వాళ్లు మాకు సమాచారం ఇచ్చారు” అని పోలీసులు తెలిపారు.

మహిళ దారుణ హత్యతో అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళన నింపింది. అసలేం జరిగింది అనేది మిస్టరీగా మారింది.