30 గంట‌ల త‌ర్వాత‌..మ‌హిళ ఛాతిలో చాకు తొల‌గింపు..ఎలా భ‌రించిందో

  • Publish Date - June 18, 2020 / 07:20 AM IST

ముల్లు గుచ్చుకుంటే..విల‌విల‌లాడుతుంటాం..అలాంటిది ఓ వ్య‌క్తి పొడిచిన చాకు ఛాతిలోకి దూసుక‌పోవ‌డంతో ఆ మ‌హిళ ప‌డిన బాధ అంతా ఇంతా కాదు. ఒక‌టి కాదు..రెండు కాదు..ఏకంగా 30 గంట‌ల పాటు..చాకు ఆమె ఛాతిలోనే ఉండిపోయింది. అంద‌రూ బ‌త‌క‌ద‌ని అనుకున్నారు. కానీ వైద్యులు చేసిన చికిత్స‌తో ఆమె బ‌తికింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

40 సంవ‌త్స‌రాలున్న మ‌ల్లిక కృష్ణ‌గిరిలోని హోసూర్ లో నివాసం ఉంటోంది. మే 25వ తేదీన ఓ వ్య‌క్తి ఆమెపై దాడి చేశాడు. చాకుతో పొడిచాడు. దీంతో చాకు ఛాతిలోకి దూసుకెళ్లింది. అనంత‌రం ఈమెను ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లారు. కానీ..అక్క‌డి వైద్యులు కోయంబ‌త్తూరు ఆసుప‌త్రికి రెఫ‌ర్ చేశారు. అప్ప‌టికే దాదాపు 30 గంట‌లు గ‌డిచిపోయాయి.

కోయంబ‌త్తూర్ మెడిక‌ల్ కాలేజీ  డాక్ట‌ర్ ఈ.శ్రీనివాస‌న్ నేతృత్వంలో వైద్యుల బృందం సుమారు మూడు గంట‌ల పాటు శ‌స్త్ర‌చికిత్స చేశారు. వైద్యులు శ్ర‌మించి ఆమె ఛాతిలో ఉన్న క‌త్తిని బ‌య‌ట‌కు తీశారు. ఆరు అంగుళాలు ఉన్న ఈ క‌త్తి..ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. అయితే..ఆమె గుండెకు ఎలాంటి గాయాలు కాలేద‌ని వైద్యులు వెల్ల‌డించారు. 

Read: మ‌రో నిర్భ‌య : AC బ‌స్సులో మ‌హిళ‌పై అత్యాచారం

ట్రెండింగ్ వార్తలు