పోక్సో, నిర్భయ, హత్యా నేరాలు : పోలీసు ఉద్యోగాల్లో చేరిన 300మందికి క్రిమినల్ రికార్డ్

తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర

  • Publish Date - January 17, 2020 / 10:48 AM IST

తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర

తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర చరిత్ర ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అభ్యర్థులు పోక్సో, నిర్భయ, హత్యా నేరాల్లో నిందితులుగా ఉన్నారు. 100 మందిపై పోక్సో, 26మంది హత్యా నేరాలు, 60మందికిపైగా నిర్భయ కేసుల్లో నిందితులు ఉన్నారు. పోలీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ లో ఉన్నారు.

సాఫ్ట్ వేర్ ఆధారంగా నేర చరిత్ర గుర్తింపు:
ఈ దశలో క్రిమినల్ రికార్డ్ విషయం వెలుగు చూసింది. రిక్రూట్ మెంట్ కు ముందు స్పెషల్ బ్రాంచ్ విచారణను అభ్యర్థులు మేనేజ్ చేశారని అధికారులు కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఆధారంగా అభ్యర్థుల నేర చరిత్రను గుర్తించారు. అభ్యర్థుల క్రిమినల్ రికార్డ్ వ్యవహారంపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. పూర్తి స్తాయి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తగా కానిస్టేబుల్‌ నియామకాలు జరుపుతున్న ప్రభుత్వం వారి వ్యక్తిగత రికార్డులపై దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా 300 మంది కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు క్రిమినల్‌ రిరకార్డు ఉన్నట్టు గుర్తించారు. పలువురు అభ్యర్ధులు పొక్సో, నిర్భయ, హత్యా నేరాల్లో నిందితులుగా ఉన్నట్టు పరిశీలనలో తేలింది.

విచారణ తర్వాత కఠిన చర్యలు:
పోలీస్ ఉద్యోగం అంటే.. క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం లాంటిది. క్రిమినల్స్ ను ఏరి పారేస్తారు పోలీసులు. అన్యాయం, అక్రమాలు జరక్కుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తారు. అలాంటి పోలీసులే క్రిమినల్స్ అయితే.. ఇక ప్రజలకు దిక్కేది. లా అండ్ ఆర్డర్ ను ఎవరు కాపాడతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో చేరిన వారిలో నేరచరిత్ర ఉన్న వారు ఉన్నారనే వార్త ఇప్పుడు డిపార్ట్ మెంట్ లో దుమారం రేపుతోంది. ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు