అత్యాచార నిందితుడికి కరోనా..60మంది పోలీసులు క్వారంటైన్ కి : పాపాత్మున్ని పట్టుకుంటే పాపం చుట్టుకున్నట్లుగా ఉంది

  • Publish Date - July 7, 2020 / 10:21 AM IST

పాపాత్మున్ని పట్టుకున్నా పాపం చుట్టుకున్నట్టే అన్నట్లుగా ఉంది నేటి పోలీసుల పరిస్థితి. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుతం సమయంలో అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పట్టుకున్న పోలీసులంతా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

ఓ మహిళలపై అత్యాచారం చేసాడనే ఆరోపణలతో పట్టుకున్న ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని పట్టకోవడానికి రంగంలోకి దిగిన 60 మంది పోలీసులు హడలిపోయారు. వారికి కూడా కరోనా సోకిందేమో అనే అనుమానంతో. దీంతో చేసేదేమీ లేక ఆ వెంటనే వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడిని బిలాస్ పూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీసులు జులై 4న అరెస్ట్ చేశారు. జూన్ లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు..బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(మైసూరు యూనిట్)లో పనిచేస్తున్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

కరోనా నిబంధలన ప్రకారం అతనికి అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సివిల్ లైన్స్ పోలీసులు ఇచ్చిన ఈ సమాచారంతో 60 మంది పోలీసులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.అనంతరం వారికి కూడా కరోనా పరీక్షలు చేశారు. త్వరలో వారి రిపోర్ట్స్ రానున్నాయి. మరోవైపు అత్యాచారానికి గురైన మహిళకు కూడా కరోనా ఉందేమో అనే అనుమానంతో ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.

Read Here>>కోటి రూపాయల కట్నం కోసం భార్యను హింసించి, ఇంట్లోంచి గెంటేసిన ఐఆర్ఎస్ అధికారి