Uttar Pradesh : డీసీఎం‌ను ఢీకొన్న అంబులెన్స్-ఏడుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి వస్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీ కొటట్టంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.

Ambulence Accident

Uttar Pradesh :  ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి వస్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీ కొటట్టంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. చనిపోయిన వారిలో ఆరుగురు వ్యక్తులు ఢిల్లీలో హెల్త్ పరీక్షలు చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటన ఫతే‌గంజ్ పశ్చిమ ప్రాంతంలో చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న అంబులెన్స్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపుకు వచ్చింది. దీంతో ఎదురుకుండా వస్తున్న డీసీఎం వ్యాన్ అంబులెన్స్ ను ఢీ కొట్టింది. అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.