Homework Pressure Student Suicide (1)
Homework Pressure Student Suicide : తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాదం నెలకొంది. మితిమీరిన హోంవర్క్ ఒత్తిడి భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న స్కూల్ నుంచి వేరే స్కూల్‌కు తనను మార్చించాలన్న బాలుడి వినతిని తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో ఒంటికి నిప్పంటించుకుని విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం ఒంటికి నిప్పంటించుకున్న బాలుడు ఆపై విగతజీవిగా మారాడు. సంజయ్ అనే విద్యార్థి విద్యార్ధి పేరాలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ
నేపథ్యంలో స్కూల్‌లో హోంవర్క్ అధికంగా ఇస్తుండటంతో తనను వేరే స్కూల్‌లో చేర్పించాలని కోరగా తల్లితండ్రులు నిరాకరించారు.
తీవ్ర మనస్ధాపానికి గురైన సంజయ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు బాలుడిని తిరువారూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పేరాలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.