jawan opened fire on colleagues
jawan opened fire on colleagues : గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో దారుణం జరిగింది. పారామిలిటరీ జవాను తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మణిపూర్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా పోర్‌బంర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని తుఫాను పునరావాస కేంద్రంలో ఉన్నారు. శనివారం సాయంత్రం బస్సులో ప్రయాణిస్తుండగా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎస్.ఇనౌచాసింగ్ అనే జవాన్.. తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి
గాయపడిన వారిని చికిత్స కోసం జామ్‌నగర్‌లోని భావ్‌సింగ్‌జీ ఆస్పత్రికి తరలించారు. మృతులు తోయిబా సింగ్, జితేందర్ సింగ్‌గా, గాయపడినవారిని చోరజిత్ సింగ్, రోహికానగా గుర్తించామని తెలిపారు. వీరిలో ఒకరి పొత్తి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లగా, మరొకరి కాలుకు గాయమైందని పోలీసులు పేర్కొన్నారు.