ACB ఉద్యోగినికి తప్పని వరకట్న వేధింపులు

  • Publish Date - May 5, 2019 / 11:11 AM IST

విజయవాడ: విజయవాడ ఏసిబి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిడిక్కాల ప్రభావతి, తన భర్త వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి, ఇదే ప్రాంతానికి చెందిన శంకరశెట్టి కిరణ్ ను గతేడాది నవంబర్ లో  ప్రేమ వివాహం చేసుకున్నారు.

కిరణ్ కుటుంబం వీరి ప్రేమను అంగీకరించక పోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది. ఈనేపథ్యంలో తనను ఇరవై లక్షలు కట్నం తెమ్మని భర్త కిరణ్ వేదిస్తున్నట్లు ప్రభావతి పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.