Accused Raj Kumar : హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి.. కొత్తూరు వద్ద మృతదేహం..!
Accused Raj Kumar : హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద పోలీసులు గుర్తించారు.
- Sreehari A
- Updated on- July 13, 2026 / 04:54 PM IST
Accused Raj Kumar
- నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ గుర్తింపు
- మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని చంపిన రాజ్ కుమార్
Accused Raj Kumar : షాబాద్ ఆరు హత్యకేసుల హంతకుడు రాజ్ కుమార్ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ఓ వెంచర్ దగ్గర రాజ్ కుమారుడు మృతదేహం కనిపించింది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 10న భార్యాపిల్లతో పాటు ఆరుగురిని ఈ నిందితుడు రాజ్ కుమార్ అత్యంత దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నుంచి ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడు. అప్పటినుంచి పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు కొత్తూరు మండలం పెంజర్లలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తనపై పోక్సో కేసు పెట్టారనే ఆగ్రహాంతో విచక్షణ కోల్పోయిన నిందితుడు రాజ్ కుమార్ జూలై 10న మూడు ప్రాంతాల్లో ఆరు హత్యలకు పాల్పడ్డాడు. షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను చంపేశాడు.
ఆ తర్వాత మైనర్ బాలికను దగ్గరలోని చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఆపై ఇంటికి వెళ్లి కూడా భార్యా కొడుకులను కూడా హతమార్చాడు. ఈ ఆరు హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు 12 బృందాలు, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరుగురిని చంపేసిన ఈ నిందితుడు తాను కూడా చనిపోతున్నా అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా కూడా ఆడాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా, రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి కొత్తూరులో రాజ్ కుమార్ శవమై కనిపించాడు.
