Anish
Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అనీష్ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని తేల్చారు.
లక్ష్మణ్ గంజ్ వారిస్ నగర్ నివాసి అనీష్ అలియాస్ సమీర్ (30). అదే ప్రాంతంలో ఉంటున్న సీతారతో దాదాపు మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సీతార భర్త రయీస్ భూరే. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. అనీష్‌కు రయీస్‌తోకూడా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఇంట్లో డబ్బులు అవసరం ఉందని అనీష్ దగ్గర అప్పుడప్పుడు మొత్తం ఏడు లక్షల రూపాయలను రయీస్ అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల అనీష్‌కు వివాహం నిశ్చమైంది. ఈ క్రమంలో డబ్బు కావాలని పలుసార్లు అనీష్ అతన్ని అడిగాడు.
ప్రియురాలు పిలవడంతో..
సితార పిలవడంతో అనిష్ ఆమె ఇంటికి వెళ్లాడు. శనివారం అర్ధరాత్రి 1గంట సమయం కావడంతో అప్పటికే రయీస్ నిద్రపోతున్నాడు. సితార, అనిష్‌లు ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో రయీస్ మేల్కొని వారిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నాడు. ఆ తరువాత అనీష్ పై దాడి చేశాడు. భార్యభర్తలు ఇద్దరూ కలిసి అతన్ని తీవ్రంగా కొట్టారు. స్క్రూడ్రైవర్ తో శరీరంపై పొడిచి, శ్రావణంతో దంతాలను పీకేసి దారుణంగా కొట్టారు. అయితే, తీవ్రగాయాలతో వారి నుంచి బయటపడిన అనీష్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు అతన్ని ఆస్పత్రికి తరలించే సమయంలో కన్నుమూశాడు.
డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే.. మృతుడి తండ్రి
అనీష్ తండ్రి ముస్తాకిమ్ మాట్లాడుతూ.. పొరుగింటి వ్యక్తి రయీస్‌కు నా కొడుకు కొన్నేండ్ల క్రితం రూ.7లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల మా అబ్బాయి వివాహం ఫిక్సయింది. పెండ్లి ఖర్చుల కోసం అప్పు వసూలు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పులు చెల్లించాలని రయీస్ అడిగాడు. దీంతో రయీస్ తన భార్య సితారతో కలిసి మా అబ్బాయిని అతిదారుణంగా చంపేశారు. అప్పు చెల్లిస్తానని పిలవడంతో అనీశ్ వాళ్లింటికి వెళ్లగా.. భార్యాభర్తలిద్దరూ కలిసి అనీశ్ కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు.
వివాహేతర సంబంధమే కారణం..
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా భావిస్తున్న సితార, అనీష్ లను అదుపులోకి తీసుకొని విచారించారు. అనీష్ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. రయీస్ భార్య సితార, అనీష్ ల మధ్య అక్రమ సంబంధం ఉందని వారు వెల్లడించారు. అయితే, ప్రియుడు అనీష్ ను హత్య చేసేందుకు సితార ఎందుకు కుట్రపన్నిందనేది తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.