శ్రీశైలంలో మళ్లీ ప్రమాదం.. భయంతో సిబ్బంది పరుగులు

  • Publish Date - September 2, 2020 / 07:59 PM IST

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద మరో ప్రమాదం జరిగింది. సొరంగ ప్రాంతంలో కరెంట్ కేబుల్ టైర్ పై డీసీఎం వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో తృటిలో ప్రమాదం తప్పింది. భారీ శబ్దాలతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.



అందులోని సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఇదివరకే జరిగిన విషాద ఘటన నుంచి సిబ్బంది ఇంకా తేరుకోలేదు. వాస్తవానికి రెండోసారి జరిగిన ప్రమాదం నిజం కాదంట.. సిబ్బంది అప్రమత్తతపై రహస్యంగా మాక్ డ్రిల్ నిర్వహించారట. అధికారులు అసలు వాస్తవం చెప్పడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు.



కొన్ని రోజుల క్రితం శ్రీశైలం ఎడమగట్టువైపు ఉన్న భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తార్తి షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుపోయింది. సొరంగ మార్గంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారని అధికారులు ధ్రువీకరించారు. 38 మంది సభ్యులు అగ్నిమాపక దళం సహాయక చర్యలు దట్టమైన పొగలో కూరుకుపోయిన 9 మంది ఉద్యోగుల మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు.