జ్యోతి హత్య కేసు : కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారన్న శ్రీనివాస్ తల్లి

జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో మరో మలుపు చేటుచేసుకుంది. 

  • Publish Date - February 15, 2019 / 10:10 AM IST

జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో మరో మలుపు చేటుచేసుకుంది. 

గుంటూరు : జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో మరో మలుపు చేటుచేసుకుంది. పోలీసులు తనను కూడా విచారించారని శ్రీనివాస్ రావు తల్లి తెలిపారు. ’ఈ ఘటన గురించి శ్రీనివాస్ రావు తనకు ఏమైనా చెప్పాడా’ అని పోలీసులు అడిగారని తెలిపారు. జ్యోతి కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసి ఉంటారని శ్రీనివాస్ రావు తల్లి చెప్పారు. చెప్పినా వినకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినందుకే జ్యోతిని హత్య చేసి ఉండవచ్చన్నారు. ఇదంతా ఒక పతకం ప్రకారం చేశారని శ్రీనివాస్ రావు తల్లి చెబుతున్నారు. జ్యోతి కుటుంబ సభ్యుల నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందన్నారు. నిందితులు దొరికితే వారికి శిక్ష వేయవద్దని.. శిక్ష చాలా చిన్నదని..డబ్బులు కడతారు మళ్లీ బయటకు వస్తారు.. వెంటనే వారిని చంపేయాలన్నారు. 

మంగళగిరిలోని ఎన్ఆర్ ఐ ఆస్పత్రిలో శ్రీనివాస్ రావును పోలీసులు విచారిస్తున్నారు. శ్రీనివాస్ రావును ఐసీయూ నుంచి తీసుకొచ్చి, 36వ వార్డులో ఉంచారు. వార్డుకు దగ్గర్లోని రూమ్ లో ఉంచి పోలీసులు విచారించారు. జ్యోతి హత్యకు శ్రీనివాస్ రావే కారణమని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు బయటపెట్టడం లేదు. చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలావుంటే గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జ్యోతి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ధర్నాకు దిగారు. మంగళగిరి డీఎస్పీ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన చాలా తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే