gouthu sireesha
Gouthu Sireesha : తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఇంచార్జి గౌతు శిరీషకు ఏపీ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అధికారులు 41 ఏ క్రింద నోటిసులు జారీ చేశారు. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా దర్యాప్తునకు సహకరించాలని ఆ నోటీసుల్లో సీఐడీ అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియా పోస్టింగుల విషయంలో ఇప్పటికే శిరీష రెండుసార్లు సీఐడీ విచారణకు హాజరయ్యారు.
నాలుగు రోజుల క్రితం సోమవారం ఉదయం మంగళగిరి సీఐడీ ఆఫీసులో ఆమెను దాదాపు 7 గంటలపాటు అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు తనకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేదని.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని శిరీష ఆరోపించారు. అంతే కాకుండా నేరం ఒప్పుకున్నటు తనతో సంతకం చేయించేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారని… తాను అందుకు మాత్రం ఒప్పుకోలేదని శిరీష చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read : Tirumala : జూన్ 11 నుంచి భక్తులకు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు