జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడిపై సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాయి.
ఢిల్లీ : జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడిపై సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాయి. పాకిస్తాన్ పై యుద్ధం చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. భారీ మూల్యం చెల్లించుకుంటారంటూ పాక్ ను ప్రధాని మోడీ ఘాటుగా హెచ్చరించారు. ఆర్మీ ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తామంటూ సంకేతాలు ఇచ్చారు. పాకిస్తాన్ ను ప్రపంచంలో ఒంటరిని చేస్తామంటూ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈమేరకు పాక్ హైకమిషనర్ కు సమన్లు భారత ప్రభుత్వం పంపింది. దెబ్బకి దెబ్బ తీయాల్సిందేనంటూ దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్ పోరుకు తోడుంటామని రష్యా ప్రకటించింది. రేపటి ఆర్ పార్టీ మీటింగ్ లో కీలయ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఉగ్రదాడిలో మొత్తం 49 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దాడి ఘటన ప్రతి భారతీయుడి హృదయాన్ని కలచి వేస్తోంది. సాటి సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తోంది. ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన సైనికుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలు కన్నీటి సంద్రంగా మారాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఈ ఘోరకలిని ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించి, భారత్‌కు బాసటగా నిలిచాయి.