Kukatpally Sahasra Case: సహస్ర కేసులో ప్లాన్ అంతా పేపర్ పై రాసుకున్న బాలుడు.. ఆ పేపర్ వైరల్..

దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో ఇలా పక్కా ప్లాన్‌తో ఒక పేపర్‌పై రాసి పెట్టుకున్నా బాలుడు.

Kukatpally Sahasra Case: సహస్ర కేసులో ప్లాన్ అంతా పేపర్ పై రాసుకున్న బాలుడు.. ఆ పేపర్ వైరల్..

Kukatpally Sahasra Case

Updated On : August 22, 2025 / 6:00 PM IST

Kukatpally Sahasra Case: హైదరాబాద్ లో సంచలనం రేపిన కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలికను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది పోలీసులు వెల్లడించారు.

హంతకుడు పక్కింటి పిల్లాడే అని పోలీసులు చెప్పడంతో అంతా షాక్ కి గురయ్యారు. పదవ తరగతి బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం సంచలనం రేపింది.

ఈ కేసుకి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ కేసులో ప్లాన్ అంతా పేపర్ పై రాసుకున్నాడు బాలుడు. ఇప్పుడా ఆ పేపర్ వైరల్ గా మారింది.

సహస్ర గొంతు కోసి, కడుపులో 18 పోట్లు..

కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు.. బాలికను హత్య చేశాడు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే బాలుడు ఉంటున్నాడు.

దొంగతనానికి వెళ్ళేటప్పుడు తన వెంట కత్తి తీసుకెళ్లాడు. సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన తర్వాత ఇంట్లోకి చొరబడ్డాడు. రూ.80 వేలు దొంగతనం చేశాడు.

దొంగతనం చేస్తుండగా బాలుడిని చూసి సహస్ర కేకలు పెట్టింది. దీంతో భయపడిపోయిన బాలుడు.. ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు.

చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోశాడు. కింద పడిపోయిన సహస్ర కడుపులో 18 పోట్లు పొడిచాడు.

పేపర్ మీద పక్కా ప్లాన్ రాసుకున్నాడు..
కాగా, దొంగతానికి వెళ్లే ముందు బాలుడు వేసుకున్న ప్లాన్ పోలీసులను సైతం ఉలిక్కిపడేలా చేసింది.

దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో ఇలా పక్కా ప్లాన్‌తో ఒక పేపర్‌పై రాసి పెట్టుకున్నాడు బాలుడు.

హౌ టూ ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ పేపర్ లో రాసుకున్నాడు.

పక్క బిల్డింగ్ నుంచి సహస్ర ఇంట్లోకి బాలుడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంట్లోంచి పక్క బిల్డింగ్‌లోకి వెళ్లిపోయాడు.

పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు దాక్కునట్లు సాప్ట్‌వేర్ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కి వెళ్లి విచారించారు పోలీసులు.

నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా కత్తి, రక్తపు గుర్తులతో ఉన్న బట్టలు లభ్యమయ్యాయి. అవి స్వాధీనం చేసుకొని బాలుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read: బీకేర్ ఫుల్.. ఒక్క వాట్సాప్ కాల్‌తో.. 7లక్షలు కొట్టేశారు.. 81ఏళ్ల వృద్ధుడిని ఇలా మోసం చేశారు..