గ్రామ వాలంటీర్ పై దాడి

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.

  • Publish Date - January 1, 2020 / 03:59 PM IST

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని పిడిబాకులతో సతీశ్ అనే వ్యక్తి..వాలంటీర్ బి.రామానాయుడుపై దాడి చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. సతీశ్ వాలంటీర్ కొంతకాలంగా గ్రామ వాలంటీర్ గా పనిచ చేస్తున్నారు. 

గతంలో కూడా గ్రామ వాలంటీర్లపై దాడి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. 2019, అక్టోబర్ నెలలో కడప జిల్లాలో గ్రామ వాలంటీర్ పై కత్తులతో దాడి చేశారు. చక్రాయపేట మండలం కుమారకాల్వలో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పాత గొడవల నేపథ్యంలో గ్రామ వాలంటీర్ తాళ్ళపల్లె రాకేష్ పై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

దీనితో రాకేష్ చేతిపై కత్తిపోటుతో బలమైన గాయం ఏర్పడింది. రాకేష్ పెదనాన్న తాళ్ళపల్లె జ్ఞానముత్తుపై కూడా టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయం ఏర్పడింది.