Basara IIIT Student Suicide Case : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ పై తల్లి సునీత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు. దీనిపై పూర్తి స్తాయిలో విచారణ జరిపించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ పై, ట్రిపుల్ ఐటీ మేనేజ్ మెంట్ పై అనుమానం ఉందన్నారు. బాసర పోలీసులపై నమ్మకం లేదని ఎస్పీకి ఇచ్చిన లేఖలో చెప్పారు భానుప్రసాద్ తల్లి సునీత.
మరోవైపు స్టూడెంట్ ఆత్మహత్యపై బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థులు. క్యాంపస్ గేటు వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్ సూసైడ్ పై వచ్చిన వార్తలను మేనేజ్ మెంట్ ఖండించింది. విద్యార్థులు ఆందోళనకు దిగినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదంది.
Also Read..Dammaiguda Girl Death Case : దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం కేసులో వీడిన మిస్టరీ
భానుప్రసాద్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ వెంకటరమణ చెప్పారు. ప్రస్తుతం క్లాసులు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. ఇటు భానుప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన డాక్టర్లు.. మరిన్ని వివరాల కోసం రిపోర్టులను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.
Also Read..Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
అమ్మా, నన్ను క్షమించు.. సూసైడ్ లెటర్ లో భానుప్రసాద్
భారీ పోలీసు బందోబస్తు నడుమ.. నిర్మల్ ఆసుపత్రిలో భానుప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు భానుప్రసాద్ ఆత్మహత్య కేసులో సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. తన చావుకి తానే కారణం అని సూసైడ్ నోటులో రాసిన భానుప్రసాద్.. తనకు మానసిక సమస్య ఉందన్నాడు. ఎప్పటినుంచో ఓసీడీతో బాధపడుతున్నట్లు అందులో తెలిపాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. చదువుపై ఇంట్రస్ట్ పోయిందని, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని సూసైడ్ లెటర్ లో రాశాడు భానుప్రసాద్. జీవితంపై విరక్తితో ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నానని చెప్పాడు. అమ్మా..నన్ను క్షమించు.. అని లెటర్ లో రాసిన భాను.. అక్కకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయాలని కోరాడు.