bengaluru cops seized 1-477-kg-of-gold-rs-98-340-cash-from-4-persons : బెంగుళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు భారీగా బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ నలుగురు సభ్యుల ముఠా అక్రమంగా బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉన్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.అలర్టైన సిబ్బంది వారికోసం గాలింపు చేపట్టి శనివారం ఉదయం నలుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.477 కిలోల బంగారాన్ని , రూ.98,340 నగదు, ఇతర విలువైన వస్తువులు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నారు.