Benagaluru : ఆ కానిస్టేబుల్‌కు నలుగురు భార్యలు…!

కర్ణాటకకు చెందిన ప్రత్యేక బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కి నలుగురు భార్యలు ఉన్నారని... వారిలో ఒక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది.

bengaluru police

Benagaluru :  కర్ణాటకకు చెందిన ప్రత్యేక బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కి నలుగురు భార్యలు ఉన్నారని… వారిలో ఒక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది.

బెంగుళూరుకు చెందిన పీఎం బాబు పోలీసు డిపార్ట్ మెంట్‌లోని ప్రత్యేక బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.  అతనికి నలుగురు భార్యలు ఉన్నారని… తనను 11 ఏళ్లుగా చిత్ర హింసలు పెడుతున్నాడని వారిలో ఒక భార్య గిరినగర పోలీసులను ఆశ్రయించింది.

ఇంట్లో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా  పలుమార్లు ఆయన్ను స్టేషన్ కు పిలిచి మందలించినా ఎలాంటి మార్పు రాలేదని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.