Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ దుర్మరణం!
Tirumala Ghat Road : ఈ ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందింది. శనివారం మధ్యాహ్నం ఏనుగుల ఆర్చి దాటిన తరువాత పిట్టగోడ దాటుకొని ఓ కారు చెట్టుని డీకొట్టింది.
- Sreehari A
- Published On : March 30, 2024 / 11:08 PM IST
Bengaluru Woman dies in Tirumala Ghat Road Accident
Bengaluru Woman : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందింది. శనివారం మధ్యాహ్నం ఏనుగుల ఆర్చి దాటిన తరువాత పిట్టగోడ దాటుకొని ఓ కారు చెట్టుని ఢీకొట్టింది.
బెంగళూరుకు చెందిన మహిళా భక్తురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భవాని అనే మహిళ తీవ్రగాయాలపాలైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల్లో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ భవాని మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డుప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also : Marriage Bureau : ఈ మ్యారేజీ బ్యూరో రూటే సపరేటు.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ జీవిత భాగస్వామిని వెతికి పెడతాం..!
