ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్

Viral Video: ఇప్పుడు ఆ పిచ్చి సంస్కృతి విమానాశ్రయాలకూ పాకుతోంది. తాజాగా, ఎయిర్‌పోర్ట్..

ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్

Viral Video

సామాజిక మాధ్యమాల్లో తమకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ ఫేమస్ అయిపోవాలని చాలా మంది తహతహలాడుతుంటారు. చిత్రవిచిత్ర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. రీల్స్ తీసుకోవడం కోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఎన్నో రకాల వేషాలు వేస్తుంటారు.

వీడియోలు తీసుకోకూడదని నిబంధనలు ఉన్న ప్రదేశాల్లోనూ తీసుకుంటూ అందరినీ కంగారు పెడుతుంటారు. జనాలకు ఇబ్బంది కలిగేలా రీల్స్ తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మెట్రో ట్రైన్లలో చాలా మంది రీల్స్ తీసుకున్న ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఆ పిచ్చి సంస్కృతి విమానాశ్రయాలకూ పాకుతోంది. తాజాగా, ఎయిర్‌పోర్ట్ బ్యాగేజీ కరాసెల్‌పై పడుకుని ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటకు రీల్స్ తీసుకుంది ఓ అమ్మాయి. కొంచం కూడా భయపడకుండా ఆమె రీల్స్ తీసుకున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. దుబాబ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఆమెకు లక్షల్లో ఫైన్ వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్లను కట్టడి చేయకపోతే ఇటువంటి ఘటనలు మరిన్ని జరుగుతాయని అంటున్నారు. కనీసం ఎయిర్‌పోర్టునైనా వదిలేయ్ అమ్మాయ్.. అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.


 Also Read: పెట్రోల్ ధరలను మరోసారి భారీగా పెంచిన పాకిస్థాన్.. లీటర్ ధర ఎంతుందో తెలుసా?