సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా.. ఎలా పడితే అలా రాస్తున్నారా.. మీకిష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారా? మీలాంటి వాళ్లకోసమే ఈ వార్త. ఇది.. వార్త అని చెప్పే కంటే.. వార్నింగ్ అని చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మేం చూపించే ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా చూడండి. అవి చూశాక.. బుద్ధిగా ఉంటే ఇంట్లో ఉంటారు. తీరు మార్చుకోకుండా సోషల్ మీడియాలో వెధవ వేషాలేస్తే.. జైల్లో ఉంటారు.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం.. సోషల్ ప్లాట్ ఫాం ఏదైనా.. మీరు పెట్టే పోస్టులు ఎలాంటివైనా.. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో.. కేవలం పర్సనల్ విషయాలను షేర్ చేసుకునేందుకే.. సోషల్ మీడియాను వాడేవారు. కానీ.. ఇప్పుడు సంతోషమైనా.. బాధైనా.. కోపమైనా.. జోకులైనా.. సెటైర్లైనా.. అన్నీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. మీ వరకు ఎలాంటివైనా పోస్ట్ చేసుకోవచ్చు. కానీ.. కొన్ని అంశాల్లో స్పందించేటప్పుడు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండాలి. లేకపోతే.. చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. శంషాబాద్ దిశ మర్డర్ కేసుపై సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. నిందితులను ఉరి తీయాలంటూ.. అంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కానీ.. కొందరు వెకిలి వెధవలు.. ఈ సున్నిత అంశంపై సెటైర్లేశారు. అంతా ఒకలా స్పందిస్తే.. వీరు అందుకు విరుద్ధంగా రియాక్ట్ అయ్యారు. దారుణ హత్యకు గురైన దిశపై అసభ్యకర కామెంట్లు రాశారు. అంతే.. మిగతా నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. వారి తాట తీయాలని డిసైడయ్యారు. దిశ ఘటనపై అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా.. గుంటూరుకు చెందిన స్మైలీ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తరలించి.. అతడు పోస్ట్ చేసిన కామెంట్లపై.. లోతుగా విచారించి తాటతీసే పనిలో ఉన్నారు.
దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన మరో యువకుడు చావన్ శ్రీరామ్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
శ్రీరామ్ నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు సీసీఎస్ పోలీసులు. చూశారుగా.. ఏదైనా లిమిట్ దాటనంత వరకే. డోస్ ఎక్కువైతే.. రిజల్ట్ ఇలా ఉంటుంది. బుద్ధిగా ఇంట్లో ఉండి లైకులు కొట్టుకుంటారో.. ఓవరాక్షన్ చేస్తూ కామెంట్లు పెట్టి పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కపెడతారో ఇక మీ ఇష్టం.
Read More : దిశ కేసు : విచారణ జరిగేది ఎక్కడ