అప్పుల తిప్పలు : యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల తయారీ

  • Publish Date - March 5, 2019 / 11:54 AM IST

తమిళనాడు : యూట్యూబ్‌లో చూసి చాలా మంది చాలా చాలా నేర్చేసుకుంటున్నారు. గతంలో యూట్యూబ్ లో చూసి డెలివరీ యత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ మహిళ గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కిలాడీ లేడీ యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కేసు విచారణలో యూ ట్యూబ్‌లో వీడియోలు చూసి నోట్లు ముద్రిస్తున్నట్లు ఆమె చెప్పడంతో పోలీసులే షాక్ తిన్నారు.
Also Read : అది ప్రభుత్వం తప్పే.. టీఆర్‌ఎస్ ఆరు సీట్లు కూడా గెలవదు

తమిళనాడులోని కడలూరు మరియప్పన్ నగర్‌కు చెందిన భరణికుమారికి ఆనంద్‌.. ఇద్దరు పిల్లలతో బాగానే ఉంటోంది. ఈ క్రమంలో భర్త ఆనంద్‌కు వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఆర్థికంగా కష్టాలు వెంటాడాయి. దీంతో ఆమె అప్పులు చేయటం.. వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడ్డారు. కానీ ఫలితం లేదు.. ఏం చేయాలని ఆలోచించిన భరణికి ఓ ఆలోచన తట్టింది. ఆ ఐడియా ఏంటంటే యూట్యూబ్. 
 

భరణి కుమారి యూట్యూబ్‌లో కొన్ని వీడియోలో చూసి… దొంగనోట్లను ఎలా ముంద్రించాలో నేర్చుకుంది. వెంటనే కలర్ ప్రింటర్ తో ఇంట్లోనే రూ.2వేలు, 500, 200 నకిలీ నోట్లను ముద్రించింది.ఆ నోట్లను కడలూరులో మారుస్తూ వచ్చింది. ఈ క్రమంలో  కడలూరులోని ఓ షాపులో రూ.200 విలువ చేసే ఫ్రూట్స్ కొని.. రూ.2వేల నోటును ఇచ్చింది. 
Also Read : విమానంలో జైహింద్ అనాల్సిందే

ఆ  నోటు కలర్ లో ఉన్న తేడాను గమనించిన షాపులో కూర్చొన్న మహిళకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ నోటును తన భర్తకు నోటు చూపించగా దొంగనోటుగా తేలింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకను గమనించిన భరణి సమీపంలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సెక్కింది. పోలీసులు కూడా బస్ ఎక్కి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించారు. యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేసినట్లుగా చెప్పింది.  అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే నకిలీ నోట్ల ముద్రించినట్లు ఆమె ఒప్పుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఇంటి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు, ప్రింటర్‌ స్వాధీనం చేసుకున్నారు.
Also Read : కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు